శబరిమలలో దర్శనమిచ్చిన 'మకర జ్యోతి'

శబరిమల కొండపై అపరూప ఘట్టం ఆవిష్కృతం అయింది.

Update: 2020-01-15 13:49 GMT
మకర జ్యోతి దర్శనం (ఫైల్ ఫోటో)

శబరిమలలో మకరజ్యోతి దర్శమిచ్చింది. భక్తజనం పులకించిన పొన్నాంబలమేడు కొండపై అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. జ్యోతిని కనులారా వీక్షించిన భక్తులు తన్మయత్వంతో పులకించి పోయారు. మకర జ్యోతి దర్శనమివ్వగానే అయ్యప్ప శరణుఘోషతో శబరిగిరులు మార్మోగిపోయాయి. మకరజ్యోతి దర్శనం కోసం శబరిగిరులకు భక్తులు పోటెత్తారు. మకర జ్యోతి దర్శనం నేపథ్యంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

పంబానది, సన్నిధానం, హిల్‌టాప్‌, టోల్‌ప్లాజా తదితర ప్రాంతాల్లో మకర జ్యోతి దర్శనం కోసం ట్రావెన్‌కోర్‌ దేవస్థానం ఏర్పాట్లు చేసింది. మకర జ్యోతి నేపథ్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి తిరువాభరణాలను సన్నిధానానికి తరలించారు. దీపారాధనతో తిరువాభరణ ఘట్టం పూర్తయింది. అనంతరం పొన్నాంబలమేడు కొండపై జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనమిచ్చారు. 

Tags:    

Similar News