Roger Binny: బీసీసీఐ ప్రెసిడెంట్ గా రోజర్ బిన్ని
Roger Binny: బీసీసీఐ సెక్రెటరీగా జైషా
Roger Binny: బీసీసీఐ ప్రెసిడెంట్ గా రోజర్ బిన్ని
Roger Binny: బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ గా రోజర్ బిన్ని ఎన్నికయ్యారు. బీసీసీఐ సర్వసభ్య సమావేశం.. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. బీసీసీఐ సెక్రెటరీగా జైషా.. ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కోశాధఇకారిగా అశిష్ షెలార్, జాయింట్ సెక్రటరీగా దేవజిత్ సైకియా, ఐపీఎల్ ఛైర్మన్ గా అరుణ్ ధుమాల్ ఎన్నికయ్యారు. ప్రతి ఒక్క పోస్టుకు ఒక్కో అభ్యర్ధి మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో.. సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.
సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్ని ఎన్నికయ్యారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి నిర్వహించిన ఎన్నికలో ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికకు సౌరబ్ గంగూలీ దూరంగా ఉన్నారు. బీసీసీఐ ప్రస్తుత కార్యదర్శి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జైషా రెండోసారి సెక్రెటరీగా ఎన్నికయ్యారు.