వాణిజ్య రాజధానిలో ఎకరం స్థలం అంత ఖరీదా !

అవును అక్కడ ఎకరా స్థలం 35కోట్లు ఓ సినిమాలో ఎకరా వందకోట్లు అంటే నమ్మలేం. కానీ ఇక్కడ మాత్రం దాదాపు మూప్పావు వరకు పలికింది. ఓ ప్రముఖ కంపెనీ చెందిన 20ఎకరాల స్థలాన్ని విక్రయించింది.

Update: 2019-10-09 12:22 GMT

అవును అక్కడ ఎకరా స్థలం 35కోట్లు.  ఓ సినిమాలో ఎకరా వందకోట్లు అంటే అశ్చర్యం కలుగుతోంది. కానీ ఇక్కడ మాత్రం దాదాపు ముప్పావు పై వరకు పలికింది. వివరాల్లోకి వెళితే.. ఓ ప్రముఖ కంపెనీ చెందిన 20ఎకరాల స్థలాన్ని విక్రయించింది. 20 ఎకరాల స్థలం అంటే ఏడు వందల కోట్ల రూపాయిలు అనమాట. ఇంతకి ఆస్థలం ఎక్కడ ఉందంటే వాణిజ్య రాజధాని ముంబైలోని థానేలో ఉంది. రేమండ్ క్లాత్ షోరూమ్ దానీ చెందిన 20 ఎకరాల స్థలాన్ని రిటైల్ సౌత్ ఆసియా అనే కంపెనీకి 700వందల కోట్లకు అమ్మింది. గ్జాండర్ గ్రూపుకు చెందిన వర్చువస్ రిటేల్ సౌత్ ఆసియా కంపెనీ కోనుగోలు చేసింది. ఈ విషయాన్నిబాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లో రేమండ్ పేర్కొంది. రేమండ్ చేందిన 125 ఎకరాల భూమిని ఆ సంస్థ మానిటైజ్ చేయాలని యోచిస్తుంది. దాదాపు 3వేల ఇళ్లు రేమండ్ రియాల్టీ నిర్మించేందుకు ఈ స్థలం అమ్మినట్లు తెలుస్తోంది. ఈ భూమి అమ్మకం ద్వారా అక్కడ ఓ హౌజింగ్ ప్రాజెక్టును ఆ కంపెనీ మొదలు పెట్టనుందని వివరించింది.

Tags:    

Similar News