బాలీవుడ్ నటి పై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ప్రశంసలు
జేఎన్‌యూ ఘటనపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనే మంగళవారం సాయంత్రం జేఎన్‌యూ క్యాంపస్‌లో పర్యటించారు.
జేఎన్‌యూ ఘటనపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనే మంగళవారం సాయంత్రం జేఎన్‌యూ క్యాంపస్‌లో పర్యటించారు. హింసాత్మక ఘటనలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఆమె మద్దతు ప్రకటించారు. దాడిలో గాయపడినవారికి సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనేపై పలువురు ప్రశంసలు కురిపిస్తు్న్నారు. ఈ జాబితాలో ఆర్థికవేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ కూడా చెరిపోయారు.
దీపికా పదుకొనేను ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసాతో పోల్చారు. దీపికా పదుకునే కుటుంబానికి వేధింపులు ఉన్నప్పటికీ సాహసం అభినందనీయమన్నారు . కొంత మంది తమ చర్యల ద్వారా సత్యం, న్యాయం, స్వేచ్ఛ లాంటివే కాకుండా కొన్ని త్యాగలు చేయవలసిన ఆదర్శాలను చూపిస్తారని లింక్డిన్‌లోని ఒక బ్లాగులో ఆయన తెలిపారు. విద్యార్ధులు, ప్రొఫెసర్లపై దాడి చేయడంలో పోలీసుల నిర్లక్ష్యం కారణం అని వింటే ఆందోళన కలిగిస్తుందన్నారు.
దీపికా నటించిన ఛపాక్ చిత్రం ఇబ్బందులు కలుగుతుందని తెలిసి కూడా ఆమె జేఎన్‌యూ బాధితులను కలవడం ఆమె దైర్య సహసాలు ఎలాంటివో చెప్పనక్కర్లేదని అభినందించారు. జేఎన్‌యూ ఆందోళనలో యువత కీలక పాత్ర పోషించడంపై ప్రశంసించారు. అన్ని మతాలకు చెందిన యువకులు ఒక్కటిగా కలిసి కవాతు చేయడం సంతోషకమని రాజన్ అన్నారు. మహాత్మాగాంధీ ప్రాణత్యాగం చేసిన స్వేచ్ఛ కోసం యువత పోరాడుతుందని పేర్కొన్నారు.
దీపికా పదుకొనె జేఎన్‌యూను సందర్శించిన నేపథ్యంలో బీజేపీ నేత తేజేందర్ సింగ్ బగ్గా ఆమెపై తీవ్రంగా స్పందించారు. టుక్డే టుక్డే గ్యాంగ్, అఫ్జల్ గ్యాంగ్‌కు మద్దతు పలుకుతున్న దీపికా పదుకొనె సినిమాలను బహిష్కరించాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఆయనతోపాటు పలువురు బీజేపీ నేతలు కూడా ఆమెపై మండిపడుతున్నారు. అయితే పలువరు నేతలు దీపిపై ప్రశంసలు కురిపిస్తు్న్నారు.డీఎంకే ఎంపీ కనిమొళి దీపక పదుకొనేకు మద్దతుగా నిలిచారు.