పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌లో దిశపై హత్య ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజాసంఘాలు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2019-12-04 16:38 GMT
Punjab CM Amarinder Singh File photo

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌లో దిశపై హత్య ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజాసంఘాలు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల భద్రత దృష్టిలో ఉంచుకొని దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌ రాష్ట్రప్రభుత్వం చిన్నారులు, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం‎ తీసుకుంది. ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆరు గంటల సమయంలో పోలీసులు వారిని ఉచితంగా గమ్యస్థానాలకు చెర్చాలని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆదేశించారు. ఒంటరి గా ఉన్న మహిళలు పోలీసు శాఖ నెంబర్ కు సమాచారం అందిచాలని కోరారు. గురువారం నుంచి ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. మహిళలు 100, 112, 181 నెంబర్లకు ఫోన్‌ చేసి ఎక్కడ ఉన్నామనేది సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు.

మహిళలు గమ్యస్థానాల టాక్సీ గానీ, రవాణా సదుపాయం లేకపోతే పోలీసులు వారికి సాయం చేయాలని డీజీపీ దిన్‌కర్‌ గుప్తాను సీఎం తెలిపారు. మహిళలను చిన్నారులను వారి సొంత ప్రదేశానికి చేర్చే సమయంలో మహిళ కానిస్టేబుల్‌ వారికి తోడుగా ఉండాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక వాహనాలు కేటాయించామని, పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయాలతోపాటు ముఖ్యనగరాల్లో అందుబాటులో ఉండనున్నాయి.   

Tags:    

Similar News