Coronavirus: స్వదేశీ పరీక్షా టెస్టింగ్ కిట్ తయారీ‌ విజయవంతం : కేంద్రమంత్రి

పూణే లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మొదటి స్వదేశీ కరోనా యాంటీబాడీ టెస్టింగ్ కిట్‌ను తయారు చేయడంలో విజయవంతమైందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ తెలియజేశారు.

Update: 2020-05-11 03:20 GMT
Union Health Minister Harsh Vardhan(File photo)

పూణే లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మొదటి స్వదేశీ కరోనా యాంటీబాడీ టెస్టింగ్ కిట్‌ను తయారు చేయడంలో విజయవంతమైందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ తెలియజేశారు. కరోనా ఇన్ఫెక్షన్లను గుర్తించడానికి ఇది సహాయపడుతుందని ఆయన అన్నారు. 10 రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కొత్త కేసులు ఏవీ కనుగొనబడలేదని ఆయన చెప్పారు.

ఇక 4 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలో, మొదటి నుండి ఒక్క ఇన్ఫెక్షన్ కేసు కూడా నమోదు కాలేదన్నారు. దేశవ్యాప్తంగా 4362 కోవిడ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పిన మంత్రి.. తక్కువ లక్షణాలు కలిగివున్న 4 లక్ష 46 వేల 856 మంది రోగులకు ఇక్కడ వసతి కల్పించవచ్చని చెప్పారు. కాగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 63 వేలు దాటింది. 41 వేల 472 మంది చికిత్సలో ఉండగా.. 19 వేల 357 మంది కోలుకున్నారు.. వివిధ రాష్టాల్లో మొత్తం 2109 మంది రోగులు మరణించారు.


Tags:    

Similar News