భారీ వ్యభిచార ముఠా గుట్టు రట్టు

ఒడిశాలో మరోభారీ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.

Update: 2019-12-02 07:55 GMT
ప్రతీకాత్మక చిత్రం

ఒడిశాలో మరోభారీ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ శివార్లలోని ఖందగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలో.. ఎయిమ్స్ నగర్లోని ఓ హోటల్ లో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్నవ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. ఇద్దరు మధ్యవర్తులతో సహా పలువురు మహిళలను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఆరుగురు మహిళలు పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు. కొంతకాలంగా హోటల్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు గుర్తించారు. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఖందగిరి పోలీసులు ఆ హోటల్ పై దాడి చేసి నలుగురు విటులు, ఇద్దరు మధ్యవర్తులు, ఆరుగురు మహిళలను అరెస్టు చేశారు. వారినుంచి అభ్యంతరకరమైన వస్తువులు, నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మాంసం వ్యాపారం చేసుకుంటున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళలను ఈ రొంపిలోకి దింపినట్టు పోలీసులు గుర్తించారు. కింగ్‌పిన్ అనే వ్యక్తే వారిని తీసుకొచ్చారని పోలీసులు తెలిపారు. అయితే అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకున్నట్టు చెప్పారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఎవరైనా ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. 


 

Tags:    

Similar News