సీఎం యోగి ఆదిత్యానాథ్‌‌పై ప్రియాంక గాంధీ ఘాటు వ్యాఖ్యలు

కాషాయం ధరించే ముఖ్యమంత్రి మత ప్రబోధాలను అనుసరించి మంచి చేయాలన్నారు.

Update: 2019-12-30 17:04 GMT
ప్రియాంక గాంధీ

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ఎన్నార్సీకి వ్యతిరేకంగా దేశా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ కార్యకర్తలపై యూపీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. దీనిపై తాము హైకోర్టుకు వెళతామని తెలిపారు. నిరసనలతో సంబంధమున్న వ్యక్తుల ఆస్తులను జప్తు చేస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించడాన్ని ప్రియాంక గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.

హక్కుల కోసం పోరాడుతున్న వారని అణిచివేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ప్రత్నింస్తున్నారని ఆమె అన్నారు. ప్రతీకారం తీర్చుకుంటామని సీఎం ప్రకటించడమేంటని దుయ్యబట్టారు. అమాయక నిరసనకారులను ప్రభుత్వ యంత్రాంగం టార్గెట్‌ చేస్తోందని, వారిపై ప్రతిచర్యలకు దిగుతోందని మండిపడ్డారు. బిజ్నోర్‌లో నమాజ్‌ కు వెళ్లిన యువకుడిని పోలీసులు కాల్చి చంపారని ఆరోపించారు.

పోలీసు కాల్పుల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులు కూడా తీసుకోవడంలేదని, పైగా బాధితులను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 5000 మందిని నిర్బంధించారని ఆరోపించారు. విచారణ జరిపించకుండా ప్రభుత్వం ప్రజలను అరెస్ట్‌ చేస్తోందని మండిపడ్డారు. కాషాయం ధరించే ముఖ్యమంత్రి మత ప్రబోధాలను అనుసరించి మంచి చేయాలన్నారు. రాముడు కృష్ణుడు కూడా శాంతిని బోధించారని, యూపీ సీఎం యోగికి ఇవేవి తేలియాదని విమర్శించారు.

కాగా.. పౌరసత్వ సవరణ చట్టంపై డిసెంబర్ 20న ఉత్తర్ ప్రదేశ్‌లో నిరసనలు తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. పోలీసులపై అల్లరిమూకలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో పోలీసులు గాయపడ్డారు. దీంతో పోలీసుల కాల్పులకు ఆందోళనకారులు కూడా మరణించారు. ఆందోళన కారుల కుటుంబాలను పరామర్శించేందుకు ప్రియాంక, రాహుల్ గాంధీ వెళ్లి పరామర్శించారు. అయితే ఆందోళనల కారులపట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్ విమర్శలు ఎదుర్కొంటోంది.


Tags:    

Similar News