దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత : ప్రధాని మోదీ

కరోనా పై ఇవ్వాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ప్రధాని మోడీ వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు.

Update: 2020-04-02 14:03 GMT
Narendra Modi (File Photo)

కరోనా పై ఇవ్వాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ప్రధాని మోడీ వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. కరోనా నియంత్రణకి అన్ని రాష్ట్రాలు ఒక్కటై కృషి చేయడం గొప్ప విషయమని అన్నారు. ఇక లాక్ డౌన్ ముగిశాక వచ్చే పరిస్థితులపై ప్రధాని చర్చించారు. వివిధ రాష్ట్రాల సీఎంలు కరోనా స్టేజీపై ప్రధాని మోడీకి రిపోర్ట్ చేశారు.

లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ఒకేసారి జనం రోడ్లపైకి రాకుండా, రోడ్ మ్యాప్ తయారు చేయాలని సీఎంలకు ఆదేశాలు జారీ చేశారు. లాక్ డౌన్ ముగిశాక ఒక్కసారే జనాలు బయటకు వస్తే మరోసారి కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కరోనా కట్టడి చేసేందుకు సామాజిక నేతల సహకారం తీసుకోవాలని అన్నారు. ఇక దేశంలో 1965 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 50 మంది చనిపోయారు. 

ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఇదిలావుంటే COVID-19 వ్యాప్తి మరియు సంబంధిత విషయాలపై రెండు వారాలలలో ప్రధానమంత్రి రెండోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్చి 25 నుండి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన తరువాత మొదటి సమావేశం ఇది. చివరి సమావేశం మార్చి 20న జరిగింది.



Tags:    

Similar News