ఆ టీవీ నటి పెళ్ళికి ప్రధాని మోడీ!

ఒక ప్రధాని తన పెళ్ళికి హారాజయ్యారంటే.. ఆ విషయం ఎవరికైనా ఎంత గర్వంగా ఉంటుంది. ఇప్పుడు హిందీ సీరియల్ నటి మోహన పరిస్థితి కూడా అదే!

Update: 2019-11-29 07:24 GMT
Mohane Kumari Singh selfie with Narendra Modi:Img source Mohane kumari instagram

సాధారణంగా భారత ప్రధాని మోడీ ఎంతో ముఖ్యమైన వివాహాలకు హాజరు అవుతారు. అయితే, ఆయన ఒక టీవీ సీరియల్ నటి పెళ్ళికి వెళ్లారు. ఇప్పుడు ఈ వార్త  అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. ప్రధాని మోడీ ఆమె వివాహానికి హాజరు కావడంతో ఆ టీవీ నటి ఆనందానికీ హద్దులు లేకుండా పోయాయి.

ఇంతకీ ఆ నటి పేరు..మోహన కుమారి సింగ్. ఈమె కేవలం హిందీ సీరియల్స్ లో నటిస్తారు. కేవలం హిందీ వారికి మాత్రమే ఆమె కొద్దిగా పరిచయం. మరి అటువంటి ఆమె వివాహానికి స్వయంగా ప్రధాని ఎందుకు హారాజర్యయారని నెటిజన్లు విపరీతంగా ఆశ్చర్యపోయారు.

నిజానికి ఆమె టీవీ నటిగానే అందరికీ తెలుసు కానీ, ఆమె ఓ రాకుమారి. మీరు విన్నది నిజమే ఆమె ఓ సంస్థానానికి రాచరికపు వారసురాలు. మోహన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా ప్రాంతపు రాజకుటుంబ యువరాణి. ఇదొక్కటే కాదు ఆ రాజవంశంలో వందేళ్ల తరువాత ఒక రాకుమారి వివాహం జరిగింది. ఇది కూడా ప్రేమ వివాహం. సురేష్ రావోట్ అనే వ్యక్తిని మోహన ప్రేమ వివాహం  చేసుకున్నారు. ఈ వివాహానికి మోహన కుటుంబసభ్యులు ప్రధాని మోడీని ఆహ్వానించారు. ఆమె పెళ్లి రేవా ప్రాంతంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. తమ వంశంలో వందేళ్ల తరువాత జరుగుతున్నా యువారాని వివాహం కావడంతో ఎంతో ఆర్భాటంగా పెళ్లివేడుకలు నిర్వహించారు. తరువాత పెద్ద విందు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, వీరి వివాహ రిసెప్షన్ ను భారీ ఎత్తున ఢిల్లీ లోనూ జరిపించారు.

ఈ రిసెప్షన్ కు ప్రధాని మోడీ హాజరు అయ్యారు. దీంతో మోహన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రధానితో కల్సి సెల్ఫీ దిగి దానిని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వివాహ వేడుక నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.




Tags:    

Similar News