PM Modi: అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ
PM Modi: మోడీ పర్యటన సందర్భంగా అమెరికాలోని పలు నగరాల్లో ర్యాలీలు
PM Modi: అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ
PM Modi: ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఈనెల 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. దీంతో అమెరికా వ్యప్తంగా మోడీ మేనియా కుదిపేస్తోంది. మోడీ రాక కోసం వేలాదిమంది భారతీయ అమెరికన్లు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అమెరికాలోని సుమారు 20 నగరాలలో ఆహ్వాన ర్యాలీలు నిర్వహించారు.
వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాన్యుమెంట్ నుంచి చారిత్రక లింకన్ మెమోరియల్ వరకు నిర్వహించిన ర్యాలీలో వందలాదిమంది పాల్గొని మోడీ మోడీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అలాగే, హూస్టన్‌లోని సుగర్లాండ్ మెమోరియల్ పార్కు వద్ద నిర్వహించిన ర్యాలీలో ప్లకార్డులను ప్రదర్శించారు. న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్, శాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ బ్రిడ్జి వంటి చారిత్రక ప్రదేశాల్లోనూ భారీ ప్రదర్శనలు నిర్వహించారు.
బోస్టన్, చికాగో, అట్లాంటా, మియామి, టెక్సాస్, డల్లాస్, లాస్ ఏంజెలిస్ నగరాల్లోనూ మోడీ రాకకు ఆహ్వానం పలుకుతూ ర్యాలీలు నిర్వహించారు. అలాగే, మోదీ ప్రసంగించే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు టికెట్ల కోసం భారతీయ అమెరికన్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అమెరికా కాంగ్రెస్ ఉభయసభలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్న నేపథ్యంలో విజిటర్స్ గ్యాలరీ సీట్లకు డిమాండ్ బాగా పెరిగింది.
21న న్యూయార్క్ సందర్శనతో మోడీ అమెరికా పర్యటన ప్రారంభమవుతుంది. అక్కడ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో పాల్గొంటారు. 22న వైట్‌హౌస్ వద్ద మోడీకి ఘనస్వాగతం పలుకుతారు. అనంతరం మోడీ-బైడెన్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 23న ప్రముఖ కంపెనీల సీఈవోలతో మోడీ సంభాషిస్తారు. అదే రోజు మధ్యాహ్నం రీగన్ సెంటర్‌లో భారతీయ-అమెరికన్లనుద్దేశించి మోడీ ప్రసంగిస్తారు. 2014 నుంచి మోడీ ఆరు సార్లు అమెరికాలో పర్యటించారు. కాగా. మోడీ అధికారిక పర్యటన ద్వైపాక్షిక బంధంలో కీలక మైలురాయిగా పలువురు అమెరికన్ సెనేటర్లు అభివర్ణించారు.