బెయిల్‌ తెచ్చుకొని బయట తిరిగితే..స్వతంత్ర సమరయోధులా.!

కేంద్రమాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చిందంబం చేసిన వ్యాఖ్యలపై స్పందించారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్.

Update: 2019-12-05 12:15 GMT
చిందంబం, ప్రకాశ్ జవదేకర్

కేంద్రమాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చిందంబం చేసిన వ్యాఖ్యలపై స్పందించారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్. బెయిల్ విడుదలై పార్లమెంట్‌ సమావేశాలకు చిదంబరం హాజరైయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిగా కొనసాగిన అన్ని రోజులు తనకు ఏ మచ్చ లేదన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో తను చేసిన పనులు అందరికీ తెలిసిందే అని పేర్కొన్నారు.

ఎన్ని కుట్రలు చేసిన చివరికి న్యాయమే విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు.కాగా.. చిందంబరం వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జవదేకర్ ధ్వజమెత్తారు. జైలు నుంచి వచ్చిన చిదంబంరం బెయిల్ నిబంధనలకు ఉల్లంఘించారని ఆరోపించారు. కేంద్ర మంత్రిగా చిదంబరం ఉన్నప్పుడే ఈ కేసు నమోదైందని గుర్తుచేశారు. ఆయన చేసిన అవినీతే ఆయను ఈ స్థితికి తెచ్చిందని విమర్శించారు.

బహిరంగంగా మాట్లడనని చెప్పిన చిదంబరం రికార్డు స్వచ్ఛంగా ఉందని మాట్లాడడం బెయిల్‌ షరతులను ఉల్లంఘించడమే అని జవదేవకర్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులపై పరోక్ష విమర్శలు చేశారు. బెయిల్ తెచ్చుకుని స్వాతంత్ర్య సమరయోధులుగా చెలామణి అవుతున్నారని వ్యాఖ్యానించారు.

చిదంబరానికి ఐఎన్‌ఎక్స్‌ మీడియా ముడుపుల కేసుతోపాటు, మనీ ల్యాండరింగ్‌ కేసుల్లో సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. తీహార్ జైలు నుంచి 3 నెలల తర్వాత బయటకు వచ్చారు. చిదంబరం మీడియాతో కానీ, బహిరంగంగా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని సుప్రీం కోర్టు షరతులు విధించిన సంగతి తెలిసిందే. 


Tags:    

Similar News