జేఎన్‌యూ విద్యార్థుపై దాడి కేసులో మరో ట్విస్ట్

దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలంలో కొందరు దుండగులు ముసుగులు ధరించి విద్యార్థులపై కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డిన సంగతి తెలిసిందే.

Update: 2020-01-10 14:45 GMT
Jnu

దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలంలో కొందరు దుండగులు ముసుగులు ధరించి విద్యార్థులపై కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డిన సంగతి తెలిసిందే. దాడి ఘటనపై పెద్ద ఎత్తున నిరసలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏబీవీపీకి చెందిన వారు ముసుగులు ధరించి దాడి చేశారని వామపక్ష విద్యార్థి సంఘాల ఆరోపించగా.. ఏబీవీపీ మాత్రం వామపక్ష విద్యార్థి సంగఘాలపై ఆరోపణలు చేస్తుంది.

ఈ క్రమంలో దీని సంబంధించిన పలు కీలక అంశాలను పోలీసులు బయటపెట్టారు. యూనివర్సిటీ పరిధిలోని పలు సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు దాడి చేసిన వారి ఫోటోలను విడుదల చేశారు. ఈ దాడిలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత ఆయిషీ ఘోష్ తో పాటు 9 మంది విద్యార్థి సంఘాలకు చెందిన నేతలు ఉన్నట్లు పోలీసలు తెలిపారు.

కాగా, సీసీ పుటేజీ అధారంగా విచారణ చేస్తామని, ఇంత వరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని తెలిపారు. అయితే దాడికి పాల్పడింది వారేనని రుజువైతే చట్ట ప్రకారం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని వివరించారు. కాగా, అయిషీ ఘోష్‌ స్పందించారు పోలీసులు విడుదల చేసిన జాబితాలో పోలీసలు జాబితా కదాని ఎవరో ఎంపిక చేసిన ఫోటోలను పోలీసులు బయటపెట్టారని విమర్శించారు. ఢిల్లీ పోలీసులు విచారణ సరైన పద్దతిలో జరగాలని ఆమె కోరారు. అయితే దాడిలో దుండుగులు ఆయిషీ ఘోష్‌తో పాటు పలువురు విద్యార్థిలను విచక్షణా రహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే.

జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలుపైకూడా దాడి జరిగిందని ఓ విద్యార్థి వెల్లడించారు. బాబర్‌ కీ ఔలాద్‌ అంటూ ఓ అంథ విద్యార్థిని సైతం చితబాదారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పదించలేదని, ఘటన స్థలానికి ఎవరు రాలేదని వాపోయారు. ఈ దాడుల్లో పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ఇనుప రాడ్లతో దాడిలో గాయపడిన వారి విద్యార్థులలో వామపక్ష, ముస్లిం విద్యార్థులవే అవడం గమనార్హం .

దుండగులు ఒక్కసారిగా క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్ధులు, ఫ్రొఫిసర్లపై విరుచుకుపడ్డారు. కొందరు లెక్చరర్లు సహా విద్యార్థులతో సమావేశం జరుగుతుండగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో పలువురు లెక్చరర్లకు కూడా గాయాలయ్యాయి.

ఏబీవీపీ నేతలే దాడులకు పాల్పడినట్లు జేఎన్‌యూ విద్యార్థి సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. కొందరు బయటి వ్యక్తులతో కలిసి దాడులకు తెగబడ్డారని చెబుతున్నారు. వర్సిటీలోని సబర్మతితో పాటు పలు వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి విద్యార్థులపై దాడులు చేశారని ఆరోపించారు.

ఈ ఘటనను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. తక్షణమే వర్సిటీ శాంతియుత వాతావరణం తెచ్చేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఢిల్లీ పోలీసులను ఆయన ఆదేశించారు. దాడుల్లో ప్రొఫెసర్లు, విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన చెందారు. విద్యార్థుల గొంతునొక్కే చర్యలుగా ఆయన అభివర్ణించారు.

 

Tags:    

Similar News