లాక్ డౌన్ పై ఇవాళ కీలక ప్రకటన!
ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై.. లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకోనున్నా
ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై.. లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. శనివారం ముఖ్యమంత్రులతో సమావేశం అనంతరం లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రధాని ఇటీవల అఖిలపక్ష సమావేశంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే శనివారం మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రుల సలహా, అభిప్రాయాలను, సూచనలను తీసుకోనున్నారు. లాక్ డౌన్ పై సమావేశం అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్రం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఈ నెల 14 తో ముగుస్తుంది.
అయితే దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పొడిగించాలని కోరుతున్నాయి. రాష్ట్రాలే కాకా జిల్లా స్థాయి యంత్రాంగం, బీసీజీ కమిటీ కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాలనే సూచిస్తున్నాయి. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రం ఒకడుగు ముందుకేసి ఏప్రిల్ 30వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించింది కూడా.
మరోవైపు ఇదివరకే లాక్ డౌన్ ఎత్తివేయడం సాధ్యం కాదని ప్రధాని హింట్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇవాళ అధికారిక ప్రకటన చేయనున్నారు. ప్రధాని మోదీ సీఎంలతో సంప్రదింపులు జరపడం ఇది రెండోసారి. ఏప్రిల్ 2న తొలి సమావేశంలో దశలవారీ లాక్‌డౌన్ ఎత్తివేతపై సీఎంలతో చర్చించారు.