Jairam Ramesh: ట్రంప్‌ నుంచి తప్పించుకునేందుకే సదస్సుకు మోడీ దూరం

Update: 2025-10-23 13:11 GMT

Jairam Ramesh: మలేసియాలో జరగనున్న ఆసియాన్ సమ్మిట్‌కు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకావడం లేదు. దీంతో మోడీ లక్ష్యంగా కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నుంచి తప్పించుకునేందుకే ఆయన ఈ సమావేశానికి వెళ్లడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్‌ నేత జైరాం రమేశ్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేతిలో చిక్కడం ప్రధాని మోడీకి ఇష్టం లేదని, దీంతో సదస్సుకు గైర్హాజరు అవుతున్నారని ఎద్దేవా చేసింది. అంటే ప్రపంచ నాయకులను ఆలింగనం చేసుకొని ఫొటో తీసుకోవడంతో పాటు తనని తాను విశ్వగురువుగా చాటుకొనే అవకాశం కోల్పోయారని జైరాం రమేష్‌ ట్వీట్ చేశారు. 

Tags:    

Similar News