వైరల్ వీడియో: కాళ్లులేని బాలుడి క్రికెట్..హాట్సాఫ్ చెబుతోన్న నెటిజన్లు

అతను కళ్లు చెదిరే షాట్స్ కొట్టడమే కాకుండా వికెట్ల రన్నింగ్‌ను చూసి అతని సంకల్పానికి కళ్లు ఆర్పకుండా ఉండిపోతున్నారు.

Update: 2019-12-28 11:39 GMT

"బాలుడనుకుంటే చిటికెనేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధనభారం, రాయి లాగ కూర్చుంటే కాలు కదపలేనంటే, ఎప్పటికి రాదుగా ఊహలకో రూపం, బతుకు నీది అనుకుంటే భవిత నీది అనుకుంటే, భయపడక వెలిగించెయ్ నెత్తురుతో దీపం, యే చీకటి ఆపును రా రేపటి ఉదయం" ఓ కవి వర్ణించిన తీరు అద్భుతం. అయితే మనో దైర్యం ఉండాలనే కానీ, సాధించలేనిది ఏది లేదు. ఇందు ఉదాహరణ ఓ వికలాంగ బాలుడి క్రికెట్ ఆటే నిదర్శనం.

ఓ దివ్వాంగ బాలుడు సంకల్ప బలంతో క్రికెట్ ఆడుతూ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. కాళ్లు లేవు అనే ఆలోచన అతని లేదు. బ్యాట్ తో బంతిని బలంగా కొడుతున్నాడు. అంతే కాదు తోటి ఆటగాడితో కలిసి పరిగెడుతున్నాడు. ఇది ఆశ్చర్యంగా ఉండోచ్చు. అతను కళ్లు చెదిరే షాట్స్ కొట్టడమే కాకుండా వికెట్ల రన్నింగ్‌ను చూసి అతని సంకల్పానికి కళ్లు ఆర్పకుండా ఉండిపోతున్నారు.

ఆ బాలుడు క్రికెట్ ఆడుతున్న వీడియోను ఐఎఫ్ఎస్ అధికారిని సుధా రమెన్ ట్వీట్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. అతడి ఆటతీరు చూసి మాటలు రావడం లేదు. క్రికెట్ పై అభిమానం ఉన్నవారు ఇష్టం లేని వారు ఈ వీడియో చూడాల్పిందే. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ బాలుడి ఆట చూసి హాట్సాఫ్ చెబుతున్నారు. అతడు కాళ్లు ఇడ్చుకుంటూ.. చేతితో బ్యాట్ పట్టుకుని , పరిగెట్టడం చూస్తే నిరాశతో బాధపడుతూ..వైకల్యంతో బాధపడుతుండే వారు ఆదర్శంగా తీసుకుంటారు. మీరు కూడా ఈ వీడియో చూడండి.   



Tags:    

Similar News