స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..

పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం పెట్రోల్ ధర రూ.10 పైసలు, డీజిల్ ధర రూ. 16 పైసలు క్షీణించింది.

Update: 2019-08-11 05:45 GMT

పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం పెట్రోల్ ధర రూ.10 పైసలు, డీజిల్ ధర రూ. 16 పైసలు క్షీణించింది. ఇక దీంతో ‍హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ ధర రూ.76.50కు, డీజిల్ ధర రూ.71.37కి చేరింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.9 పైసలు తగ్గుదలతో రూ.76.24కు క్షీణించింది. డీజిల్‌ ధర 16 పైసలు క్షీణతతో రూ.70.76కు తగ్గింది. ఇటు విజయవాడలో పెట్రోల్ ధర 9 పైసలు తగ్గుదలతో రూ.75.87కు క్షీణించింది. డీజిల్ ధర 16 పైసలు క్షీణతతో రూ.70.42కు తగ్గింది. ఢిల్లీలో పెట్రోల్ ధర 9 పైసలు తగ్గుదలతో రూ.71.99కు దిగొచ్చింది. డీజిల్ ధర కూడా 15 పైసలు తగ్గుదలతో రూ.65.49కు క్షీణించింది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.9 పైసలు క్షీణతతో రూ.77.65కు తగ్గింది. డీజిల్ ధర 16 పైసలు తగ్గుదలతో రూ.68.66కు క్షీణించింది.  

Tags:    

Similar News