అర్హులైన వారందరికీ తిరిగి పెన్షన్లు పంపిణీ: ఎంపీడీవో వి.శాంతామణి
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆమె పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, డిజిటల్ అసిస్టెంట్ లతో సమావేశం నిర్వహించారు .
అంబాజీపేట: మండలంలో 380 పెన్షన్ నిలిచిపోయాయని వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారందరికీ తిరిగి పెన్షన్లు పంపిణీ చేస్తామని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీడీవో వి.శాంతామణి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆమె పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, డిజిటల్ అసిస్టెంట్ లతో సమావేశం నిర్వహించారు .
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చిన వ్యక్తులకు, ఆదాయపు పన్ను చెలిస్తున్న వారికి పెన్షన్లు లభించవన్నారు. ముఖ్యంగా నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్నట్లయితే పెన్షన్లు నిలిపివేస్తామని,వాహనాలు లేకుండా జాబితాలో నమోదు అయి ఉంటే ఆర్డీవో స్థాయి నుండి గుర్తించాల్సి ఉందన్నారు. అర్హులైన వారికి తగిన దర్యాప్తు జరిపి ఈ నెల పెన్షన్ ను వచ్చే నెలలో ఇచ్చే పెన్షన్లు తో కలిపి ఇచ్చేుదుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ లోగా వాలంటీర్లు తమ పరిధిలో ఉన్న,పెన్షన్లు నిలిచిపోయిన కుటుంబ వివరాలను ఆన్లైన్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు ఎస్బిశర్మ, బి.సత్యనారాయణ,వి. లక్ష్మీపతి, గ్రామ సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.