అయోధ్యలో రామమందిర నిర్మాణానికి 10 కోట్ల విరాళం

అయోధ్యలో రామమందిర నిర్మాణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తామని కేంద్రప్రభుత్వం గతవారం లోక్‌సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

Update: 2020-02-09 10:58 GMT

అయోధ్యలో రామమందిర నిర్మాణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తామని కేంద్రప్రభుత్వం గతవారం లోక్‌సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ఆ ఆలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పాట్నాలోని మహవీర్‌ ఆలయ పాలక మండలి రామమందిర నిర్మాణానికి రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ముందుగా రూ.2 కోట్లను చెక్కు రూపంలో అందజేయనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత మిగతా సొమ్మును నిర్మాణ పనులు ప్రారంభమైన అనంతరం దశలవారీగా అంజేస్తామని మహావీర్ మందిర్ న్యాస్ కార్యదర్శి ఆచార్య కిశోర్ కునాల్ తెలియజేశారు.  

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కేంద్రంపై, ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి స్వతంత్ర ట్రస్ట్‌ను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ ఆలయ నిర్మాణ విరాళాల కోసం 'శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర' పేరుతో ఓ ట్రస్ట్ ని ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్‌లో 15 మంది సభ్యులు ఉండగా, మాజీ అటార్నీ జనరల్, అయోధ్య కేసులో హిందువుల పక్షాన వాదనలు వినిపించిన కే పరాశరన్ దీనికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇక తాము ఏర్పాటుచేసిన హుండీలో అణాపైస విలువ చేసే ముప్ఫై నాణేలను భక్తులు వేశారని కునాల్ వెల్లడించారు. వీటిపై సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి చిత్రాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ పురాతన నాణేలను ఈస్ట్‌ ఇండియా కంపెనీ 1818లో ముద్రించినట్లు పేర్కొన్నారు. 

Tags:    

Similar News