Drinking Water: విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరు సరఫరా పై సంతృప్తి

Drinking Water: తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలల్లో పిల్లలకు సురక్షితమైన తాగునీరు అందించడంపై పార్లమెంటరీ కమిటీ సంతృప్తి

Update: 2021-03-09 07:33 GMT

ఇమేజ్ సోర్స్: ది హన్స్ ఇండియా


Drinking Water: పాఠశాలలు, అంగన్‌వాడీలు మరియు గురుకుల పాఠశాలల్లో పిల్లలకు సురక్షితమైన తాగునీరు అందించడంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సాధించిన 100 శాతం పురోగతి సాధించాయని పార్లమెంటరీ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. 'పిల్లలకు సురక్షితమైన తాగునీరు నినాదంతో 2020 అక్టోబర్ 2 న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కమిషన్ తన నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో 42,655 అంగన్‌వాడీ కేంద్రాలు, 41,619 పాఠశాలలకు 100 శాతం పంప్ కనెక్షన్లు ఇవ్వగా, తెలంగాణ కూడా 27,310 అంగన్‌వాడీలు, 22,882 పాఠశాలల్లో 100 శాతం లక్ష్యాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు మాత్రమే ఈ రెండు రంగాలలో 100 శాతం లక్ష్యాన్ని సాధించాయని పేర్కొంది.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మొదలైన ఈ కార్యక్రమం ముందుగా తెలంగాణలో పూర్తయింది. వందరోజుల ప్రణాళికను విజయవంతంగా పూర్తి చేసిన తెలంగాణ అధికారులు.. రాష్ట్రవ్యాప్తంగా మిషన్‌ భగీరథ నల్లా కనెక్షన్లు‌ ఇచ్చి వాటికి జియో ట్యాగింగ్ చేయడం మరో కీలక ముందడుగు అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Tags:    

Similar News