Union Budget: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
ఈనెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. రాష్ట్రపతి ప్రసంగం, కీలక బిల్లులు చర్చ, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశం జరుగుతుంది.
Union Budget: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
ఈనెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలు సమావేశమవుతాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
ఈ సమావేశాల్లో ప్రభుత్వం కొన్ని కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందులో “వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు” మరియు 30 రోజుల పాటు జైల్లో ఉంటే సీఎం, మంత్రుల పదవులను రద్దు చేసే బిల్లులపై చర్చ జరగనుంది. ఈ బడ్జెట్ సేషన్స్‌లో దేశ వ్యాప్తంగా ఎన్నికల, ఆర్థిక, రాజకీయ అంశాలపై సభ్యుల చర్చలకు ప్రాధాన్యం కేటాయించబడుతుంది.