Alert : అక్టోబర్ లో తొమ్మిది రోజులు బ్యాంకులు బంద్...

Update: 2019-09-29 14:22 GMT

నిత్యం బ్యాంకులో లావాదేవీలు చేసేవారికి ఇది ఒక అలెర్ట్ అని చెప్పాలి. వచ్చే నెల( అక్టోబర్ ) లో మొత్తం బ్యాంకులకి తొమ్మిది రోజులు సెలవులు రానున్నాయి. ఇందులో ముఖ్యంగా 6,7,8 తేదిల్లో బ్యాంకులు వరుసగా పని చేయవు. ఇక ఇదే నెలలో అక్టోబర్ రెండున గాంధీ జయంతి రానుంది. ఇక మొత్తం ఈ నెలలో రెండు శనివారాలు, నాలుగు ఆదివారాలు రానున్నాయి.

అక్టోబర్ లో బ్యాంకు హాలిడేస్ ఇలా ఉన్నాయి...

అక్టోబర్ 2 : గాంధీ జయంతి

అక్టోబర్ 6 : ఆదివారం

అక్టోబర్ 7 : మహార్నవమి

అక్టోబర్ 8 : దసరా

అక్టోబర్ 12 : రెండో శనివారం

అక్టోబర్ 13 : ఆదివారం, వాల్మీకి జయంతి

అక్టోబర్ 20 : ఆదివారం

అక్టోబర్ 26 : నాలుగో శనివారం

అక్టోబర్ 27 : దీపావళి, ఆదివారం

Tags:    

Similar News