పాక్‌తో చర్చలు జరిగితే ఇక పీవోకే పైనే..

Update: 2019-08-18 16:23 GMT

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, వారికి సహకరించడం ఆపనంత వరకూ పాకిస్థాన్‌తో చర్చల ప్రసక్తేలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. అంతేకాదు ఒకవేళ ఆ దేశంతో చర్చల ప్రస్తావన వస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి మాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. హరియాణాలోని కల్కాలో నిర్వహించిన బీజేపీ జన ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్న రాజ్‌నాథ్ భారత వైఖరిని స్పష్టం చేశారు. పాక్‌తో చర్చలకు వస్తే ఒక్క పీఓకే తప్పా మరే అంశంపై కూడా మాట్లాడబోమని కుండబద్దలుకొట్టారు. పాక్‌తో ఏ అంశం గురించి ఎందుకు చర్చించాలని రాజ్‌నాథ్ నిలదీశారు. 

Tags:    

Similar News