ఒకే పోలికలతో ఉన్న 8మందితో పరీక్ష రాయించి దొరికిపోయిన ఎంపీ

పరీక్షల్లో పాస్ కావడానికి కొందరు విద్యార్థులు ఎన్నో ఎత్తుగడలు వేస్తారు. ఒక్కొ సారి టెక్నాలజీని ఉపయోగించి మాస్ కాపింగ్ కి పాల్పడతారు. అయితే ఓ ప్రజా ప్రతినిధి తనకు డిగ్రీ పట్ట రావడానికి వినూత్నంగా ఆలోచించింది.

Update: 2019-10-22 09:17 GMT

పరీక్షల్లో పాస్ కావడానికి కొందరు విద్యార్థులు ఎన్నో ఎత్తుగడలు వేస్తారు. ఒక్కొ సారి టెక్నాలజీని ఉపయోగించి మాస్ కాపింగ్ కి పాల్పడతారు. అయితే ఓ ప్రజా ప్రతినిధి తనకు డిగ్రీ పట్టా రావడానికి వినూత్నంగా ఆలోచించారు. ఎలాగైనా డిగ్రీ సాధించాలని ఆమె వేసిన ఎత్తుగత పారలేదు సరికదా అడ్డంగా దొరికిపోయింది. ఇంతకి ఆమె వేసిన ఎత్తుగడ ఎంటో తెలుసా?

ఒకే పోలికలతో ఉన్న ఎనిమిది మందితో పరీక్షలు రాయించారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. అధికార పార్టీ అవామీ లిగ్‌కు చెందిన ఎంపీ తమన్నా నుస్రత్‌ బంగ్లాదేవ్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ చదువుతున్నారు. అయితే బీఏలో దాదాపు 13 సబ్జెకుల పరీక్షలు రాసేందుకు తన పోలికలతో 8 మంది మహిళలతో పరీక్ష రాయించారు. పైగా వారికీ తన అనుచరులు కాపలాగా ఉన్నారు. ఈ విషయాల్ని నాగరిక్ అనే ప్రముఖ టీవీ చానల్ బయట పెట్టింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఎంపీ నుస్రత్‌ను యూనివర్సిటీ అధికారులు బహిష్కరించారు.

Tags:    

Similar News