కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు కన్నుమూత..

కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన బేణీ ప్రసాద్‌ వర్మ (79) మరణించారు.

Update: 2020-03-28 02:59 GMT
beni prasad verma

కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన బేణీ ప్రసాద్‌ వర్మ (79) మరణించారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వర్మ శుక్రవారం సాయంత్రం లక్నోలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 7 గంటలకు తుదిశ్వాస విడిచారు, ఈ విషయాన్నీ ఆయన కుమారుడు రాకేశ్ వర్మ దృవీకరించారు. వర్మ 1996-1998 మధ్య అప్పటి ప్రధాని హెచ్‌డి దేవేగౌడ మంత్రివర్గంలో టెలికాం మంత్రిగా పనిచేశారు.. ఆ తరువాత కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ 2 హయాంలో ఉక్కు మంత్రిగా పనిచేశారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆసుపత్రికి చేరుకుని ఆయన పార్థివదేహానికి సంతాపం తెలిపారు. ఆయన పార్టీకి చేసిన సేవలు ఎప్పటికి మరువలేనివి అని అన్నారు. కేంద్ర మంత్రిగా, ఎంపీగా తన బాధ్యతను సమర్ధవంతంగా నెరవేర్చారని కొనియాడారు.

వర్మకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్పీ (సమాజ్‌వాదీ పార్టీ) వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌తో వర్మకు నాలుగు దశాబ్దాలుగా మంచి అనుబంధం ఉంది. 2007 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో, వర్మ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2009 లో, వర్మ అధికారికంగా కాంగ్రెస్‌లో చేరారు.. లోక్సభ ఎన్నికల్లో గోండా సీటు నుండి పోటీ చేశారు, కాని ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2016 లో తిరిగి రాజ్యసభకు పంపిన సమాజ్ వాదీ పార్టీలో చేరారు. 2016 లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన బేణీ ప్రసాద్‌ వర్మ.. 2022 లో రిటైర్ అయ్యేవారు. ఆయన మృతితో ఈ స్థానం ఖాళీ కానుంది. అది కూడా బీజేపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. ఇక బేణీ ప్రసాద్‌ వర్మ మరణానికి యుపి గవర్నర్ ఆనంద బెన్ పటేల్, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్, ప్రగతిషీల్ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు శివపాల్ యాదవ్ తదితరులు సంతాపం తెలిపారు.


Tags:    

Similar News