సచిన్, ధోనీ, తర్వాత సన్నీ లియోన్ ...అత్యంత ప్రమాదకర వ్యక్తులు
ఇండియా క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్‌లకు, ధోని, ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరికి సంబంధించిన సమాచారం కోసం ఫ్యాన్స్ అంతర్జాలంలో తెగవెతుకుతున్నారు. సచిన్ , ధోని అత్యంత,ప్రమాదకరంగా మారారు.
ఇండియా క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్‌లకు, ధోని, ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరికి సంబంధించిన సమాచారం కోసం ఫ్యాన్స్ అంతర్జాలంలో తెగవెతుకుతున్నారు. సచిన్ , ధోని అత్యంత,ప్రమాదకరంగా మారారు. అంతర్జాలంలో వెతుకుతున్నప్పుడు వీరికి సంబంధించిన నకిలీ లింకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సచిన్, ధోనీ కోసం సెర్చ్ చేస్తే ఎక్కువగా మాలీసియస్ వెబ్‌సైట్లకు రీడైరెక్ట్ అవుతున్నాయని ఓ ప్రముఖ యాంటీ వైరస్ సంస్థ మెకాఫీ పేర్కొంది. ఇంటర్నెట్ లో ఎక్కువగా నెటిజన్లు స్పోర్ట్స్, మూవీస్, టీవీ షోల గురించి సెర్చ్ చేస్తున్నారు. సెలబ్రెటీల ఫోటోలు, వీడియోలకోసం ఎక్కువగా వెతుకుతుంన్నారని మెకాపీ తెలిపింది.
సైబర్ నేరగాళ్లు నకిలీ లింక్‌లను క్రియేట్ చేసి నెటిజన్లను ఆకర్షించేలా చేస్తున్నారని తెలిపింది. వాటిపై క్లిక్ ఇస్తే అశ్లీల, ప్రమాదకర వెబ్‌సైట్లు వస్తున్నాయి. కొన్ని సార్లు మొబైల్,కంప్యూటర్ వైరస్,హ్యాక్ అవుతున్నాయి. నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని మెకాఫీ వివరించింది. మెకాఫీ విడుదల చేసిన తాజా జాబితా ప్రకారం అత్యంత ప్రమాదకరమైన సెలబ్రెటీలుగా ధోని, సచిన్‌లు ఆగ్రస్థానంలో కొనసాగుతున్నారు. వారి తర్వాత హిందీ బిగ్‌బాస్-8 విజేత గౌతమ్ గులాటీ, బాలీవుడ్ నటి సన్నీ లియోన్, రాధికా ఆప్టే,శ్రధ్దా కపూర్, హర్మన్‌ప్రీత్ కౌర్, పీవీ సింధు, క్రిస్టియానో రొనాల్డోలు ఉన్నారు.