ప్రధాని మోదీకి తాకిన నిరసన సెగలు

ప్రధాని నరేంద్ర మోదీకి చేదు అనుభవం ఎదురైంది. బెంగాల్‌ పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లారు.

Update: 2020-01-11 11:55 GMT
Narendra Modi (File Photo)

ప్రధాని నరేంద్ర మోదీకి చేదు అనుభవం ఎదురైంది. బెంగాల్‌ పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లారు. ఢిల్లీలోని జేఎన్‌యూ హింసకాండకు నిరసనగా, అలాగే పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్సార్సీకి వ్యతిరేకంగా మోదీ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతేకాకుండా ప్లేకార్డులు పట్టుకుని మరి నిరసన ప్రదర్శన చేశారు. ప్రధాని మోదీ కాన్వాయ్‌ వెళ్లే మార్గంలో పెక్లీలు, ప్లాకార్డులు తోపాటు నల్లజెండాను ఏర్పాటు చేశారు. కాగా.. పశ్చిమ బెంగాల్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఢిల్లీ కోల్‌కత్తాకు వెళ్లిన విషయం తెలిసిందే. మోదీ విమానాశ్రయం చెరుకున్నాక పలువురు ముఖ్యనేతలు ఘన స్వాగతం పలికారు.

బెంగాల్ లో పర్యటించిన ప్రధాని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్ కతాలోని రాజ్‌భవన్‌లో సమావేశం అయ్యారు. అయితే భేటీకి సంబంధించి పూర్తి సమాచారం తెలియలేదు. ఏ ఏ అంశాలు చర్చించారో తెలియాల్సి ఉంది. అలాగే ఈ నెల 12న కోల్‌కతా పోర్ట్‌ ట్రస్ట్‌ 150వ సందర్భంగా ప్రధాని మోదీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి మరోసారి కలిసే అవకాశం ఉంది. బెంగాల్ పర్యటనకు వెళ్లిన మోదీ నిరసన సెగలు తాకుతున్నాయి. ఆందోళన కారులు రోడ్లపై భారీ ఎత్తున నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఆందోళనకారును ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే ప్రభుత్వం పౌరసత్వం సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయని మమతా బెనర్జీ గతంతో స్పష్టం చేశారు. దానికి వ్యకిరేకంగా ర్యాలీ కూడా చెపట్టారు. కాగా.. ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలంలో కొందరు దుండగులు ముసుగులు ధరించి విద్యార్థులపై కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డిన సంగతి తెలిసిందే. దాడి ఘటనపై పెద్ద ఎత్తున నిరసలు వ్యక్తమవుతున్నాయి. ఏబీవీపీ నేతలే దాడులకు పాల్పడినట్లు జేఎన్‌యూ విద్యార్థి సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. కొందరు బయటి వ్యక్తులతో కలిసి దాడులకు తెగబడ్డారని చెబుతున్నారు. వర్సిటీలోని సబర్మతితో పాటు పలు వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి విద్యార్థులపై దాడులు చేశారని ఆరోపించారు.   

Tags:    

Similar News