Mayawati: రాష్ట్రపతి కాబోతున్నారన్న పుకార్లపై మాయావతి క్లారిటీ
Mayawati: రాష్ట్రపతి ఆఫర్ ఏ పార్టీ నుంచి వచ్చినా వద్దు : మాయావతి
Mayawati: రాష్ట్రపతి కాబోతున్నారన్న పుకార్లపై మాయావతి క్లారిటీ
Mayawati: రాష్ట్రపతి కాబోతున్నారన్న పుకార్లపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి స్పందించారు. ఇదంతా తప్పుడు ప్రచారమని, రాష్ట్రపతితో పాటు ఏ పదవి ఏ పార్టీ నుంచి ఆఫర్ వచ్చినా ఆమోదించే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని బీఎస్పీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆమె నిన్న సమావేశం అయ్యారు.
తమ పార్టీ అంతమవుతుందని తెలిసినప్పుడు.. అలాంటి పదవికి తానెలా అంగీకరిస్తాను అని అన్నారు. బీజేపీనే కాదు ఏ పార్టీ నుంచి రాష్ట్రపతి పదవికి ఆహ్వానం వచ్చినా తీసుకునే ప్రసక్తే లేదన్నారు. భవిష్యత్‌లో తప్పుదారి పట్టించే ప్రచారం మళ్లీ జరగొచ్చని అలాంటి వాటి ట్రాప్‌లో పడొద్దని పార్టీ కార్యకర్తలకు మాయవతి స్పష్టం చేశారు.