నిరసనకారుల దాడి నుంచి పోలీసును కాపాడిన వ్యక్తి ఎవరో తెలుసా

ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో డిసెంబర్ 20న పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్నాయి.

Update: 2019-12-27 17:07 GMT
హజ్జీ ఖాదిర్‌, అజయ్‌

హిందూ ముస్లింల మధ్య స్నేహాభావానికి నిదర్శనం ఈ ఘటన. ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో డిసెంబర్ 20న పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు పోలీసులపై దాడి చేయడంతోపాటు ఆరు వాహనాలకు నిప్పు అంటించారు. ఈ ఘటనలో పోలీసులు టియర్‌ గ్యాస్‌ను ఉపయోగించి ఆందోళన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ అల్లర్లలో కొందరు అల్లరిమూకలు హిందూ పోలీసుపై దాడికి యత్నించాయి. ఈ నేపథ్యంలో ఓ ముస్లిం వ్యక్తి వచ్చి అతన్ని రక్షించాడు.

ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో నిరసనకారులు రెచ్చిపోయారు పోలీసులపై దాడికి చేశారు. అజయ్‌ కుమార్‌ అనే పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడే మసీదులో నమాజ్ చేసుకొని తిరిగి వస్తున్న హజ్జీ ఖాదిర్‌, అజయ్‌ను కాపాడాడు. అతన్ని ఇంటికి తీసుకెళ్లి వైద్యం అందించాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. అజయ్ చేతికి, తలకి తీవ్ర గాయలైయ్యాయి. 

పోలీస్ అధికారి అజయ్ కుమార్ మాట్లాడుతూ.. అల్లరిమూకలు పోలీసులపై దాడి దిగాయి. కొందరూ నాపై దాడి చేస్తున్నారు. నేను బతుకుతాను అనే నమ్మకం పోయింది. అయితే ఇంతలో హజ్జీ ఖాదిర్‌ దేవుడిలా వచ్చి నన్ను రక్షించాడు. వాళ్ల ఇంటికి తీసుకెళ్లి నా సాయం చేశాడు. మంచి నీరు,దుస్తువులు ఇచ్చాడ అని తెలిపాడు. అల్లర్లు జరుగుతున్న సమయంలో పక్కన ఉన్న మసీదులో నమాజ్ చేసుకుంటున్నానని, ఈ ఘర్షణ గురించి తెలిసింది. వెంటనే సంఘటన స్థలానికి వెళ్తే ఓ గుంపు అజయ్ పై దాడి చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లి అజయ్‌ను రక్షించానని హజ్జీ ఖాదిర్‌ తెలిపాడు.   




 



Tags:    

Similar News