Maharashtra: డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులతో మహారాష్ట్ర ప్రభుత్వం అలర్ట్‌

Maharashtra: రేపటి నుంచి మళ్లీ కఠిన ఆంక్షలు * డెల్టా ప్లస్‌ కరోనా కేసుల దృష్ట్యా నూతన మార్గదర్శకాలు

Update: 2021-06-27 08:04 GMT

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే (ఫైల్ ఇమేజ్)

Maharashtra: మహారాష్ట్రలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులతో ప్రభుత్వం అలర్ట్‌ అయింది. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతుండటం, ఒకరు మృతి చెందడంతో రాష్ట్రం అప్రమత్తమైంది. డెల్టా ప్లస్‌ వేరియంట్‌తోపాటు థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో సడలించిన ఆంక్షలను మళ్లీ కఠినం చేశారు. ఇకపై మొదటి, రెండో దశలో ఉన్న జిల్లాలన్నింటిలో 3వ దశలో విధించే ఆంక్షలు కొనసాగించనున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో సోమవారం నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు కొనసాగనున్నాయి. ఈ ఆంక్షలు కనీసం 15 రోజుల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయని అధికారులు తెలిపారు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి ఆంక్షలను కఠినతరం చేయడమా,.? లేదా సడలించడమా.?? అనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

నిత్యావసరాలు, అత్యవసర సేవల వస్తువులు విక్రయించే షాపులకు శని, ఆదివారాలతోపాటు ప్రతి రోజు 4 గంటల వరకు తెరిచేందుకు అనుమతించారు. రెస్టారెంట్లు, హోటళ్లను కూడా సాయంత్రం 4 గంటల వరకు 50 శాతం సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతించారు. అయితే వీకెండ్‌లో మాత్రం తెరిచేందుకు అనుమతించకపోయినప్పటికీ హోమ్‌ డెలివరీ సేవలు అందించేందుకు పర్మిషన్‌ ఇచ్చారు. మాల్స్, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు ఈ పదిహేను రోజులు మూతపడనున్నాయి. ముంబై, పుణే, థాణేలతోపాటు మొత్తం 33 జిల్లాల్లో మూడో దశ ఆంక్షలు అమలు కానున్నాయి

Similar News