వీధుల్లో తిరుగుతున్న జనంపై ఆగ్రహించిన సీఎం ఉద్ధవ్ థాకరే

కరోనా సంక్రమణను నివారించడానికి దేశంలో 21 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2020-03-30 10:03 GMT

కరోనా సంక్రమణను నివారించడానికి దేశంలో 21 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో 7 రోజులుగా మహారాష్ట్రలో కర్ఫ్యూ అమలులో ఉంది. అయినప్పటికీ, నగరాల్లో కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్లు మరియు మెడికల్ షాపుల వద్ద ప్రజలు అధికంగా ఉన్నారు. అదే సమయంలో, ఇతర రాష్ట్రాల కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో వలసపోతున్నారు. దీంతో రోడ్లపై జనం భారీగా కనిపిస్తున్నారు. పోలీసులు ఎంత వారించినా ప్రజలు ఈ ధోరణి మానడం లేదు. దాంతో కొందరిపై పొలిసులు లాటి ఛార్జ్ చేయవలసి వచ్చింది. దీనిపై సీఎం ఉద్ధవ్ థాకరే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఆదివారం సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సూచనలు చేశారు. "ప్రజలు లాక్ డౌన్ ను కచ్చితంగా పాటించాలి.. లేదంటే కఠినమైన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. మిగతావి ప్రభుత్వం చూసుకుంటుంది. రాష్ట్రంలో ఆహార పదార్థాల కొరత లేదు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలు తమ ఇళ్లలో ఉండడం ద్వారా కరోనావైరస్ ను ఓడించవచ్చు."అని పేర్కొన్నారు.

మహారాష్ట్రలో కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా పరిస్థితి మరింత దిగజారుతోంది. సోమవారం ఉదయం నాటికి, పూణే నుండి 5, ముంబైలో 3, నాగ్పూర్, కొల్హాపూర్ మరియు నాసిక్లలో 2 సంక్రమణ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో సోకిన వారి సంఖ్య 215 కి చేరుకుంది. సంక్రమణ కారణంగా ఇప్పటివరకు 8 మంది మరణించారు. కొల్లాపూర్‌లోని ఆసుపత్రిలో 60 ఏళ్ల కరోనా బాధితుడు శనివారం రాత్రి మరణించాడు. వాస్తవానికి అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది మరియు డయాబెటిస్ కూడా ఉంది.

అతని మరణంపై ఇంకా నివేదిక వెలువడ లేదు. నివేదిక వచ్చిన తర్వాతే ఆ వ్యక్తి కరోనా సంక్రమణ ద్వారా మరణించారా లేక ఇంకేవైనా అనారోగ్య కారణాలతో మరణించారా అనేది తెలుస్తోంది. మరోవైపు 25 కరోనా సోకిన వారు కోలుకోవడంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.


Tags:    

Similar News