మహారాష్ట్రలో వార్ వన్‌సైడ్ ..

మహారాష్ట్రలో వార్ వన్ సైడ్ అని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఈసారి కూడా బీజేపీ హవానే కొనసాగుతుందని ఇండియా టుడే సర్వే తేల్చింది. మహారాష్ట్రలో బీజేపీ 166 స్థానాల నుంచి 194 వరకు గెలుచుకుంటుందని తెలిపింది.

Update: 2019-10-21 13:50 GMT

మహారాష్ట్రలో వార్ వన్ సైడ్ అని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఈసారి కూడా బీజేపీ హవానే కొనసాగుతుందని ఇండియా టుడే సర్వే తేల్చింది. మహారాష్ట్రలో బీజేపీ 166 స్థానాల నుంచి 194 వరకు గెలుచుకుంటుందని తెలిపింది. కాంగ్రెస్ మాత్రం 72 నుంచి 90 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని.. ఇతరులకు 22 నుంచి 34 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

మహరాష్ట్రలో అధికారం మళ్లీ కమలానికే దక్కనుందని టైమ్స్ నౌ ఎగ్గిజ్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ కూటమికి 230 స్థానాలు, కాంగ్రెస్ కూటమి 48 సీట్లు, ఇతరులకు 10 స్థానాలు దక్కుతాయని టైమ్స్ నౌ ఎగ్గిజ్ పోల్స్ వెల్లడించాయి.

మరాఠ గడ్డపై మరోసారి కమలం వికసించడం ఖాయమని తేల్చింది ఇండియా టీవీ సర్వే. బీజేపీ కూటమి 230 స్థానాలను సాధిస్తుందని.. కాంగ్రెస్ మిత్రపక్షాలు 48 సీట్లకే పరిమితమవుతాయని, ఇతరులకు 10 స్థానాల వరకు రావచ్చని ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి.

బీజేపీ కూటమి 204 సీట్ల వరకు గెలుచుకుంటుందని ఏబీపీ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. కాంగ్రెస్ మిత్రపక్షాలు మాత్రం 69 స్థానాలకు పరిమితం కాగ.. ఇతరులకు 15 సీట్లు దక్కే అవకాశం ఉందని ఏబీపీ సర్వే వెల్లడించింది. 

Tags:    

Similar News