గవర్నర్ డెడ్ లైన్..కమల్‌నాథ్ ప్లాన్ ఏంటి?

Update: 2020-03-17 04:48 GMT

మధ్యప్రదేశ్ లో రాజకీయాలు నాటకీయ పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించని పరిస్థితి నెలకొంది. నిన్న ఉదయం ప్రారంభమైన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం వెంటనే వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో ఈనెల 26 వరకు సమావేశాలను వాయిదా వేస్తూ స్పీకర్ ప్రజాపతి నిర్ణయం తీసుకున్నారు. అయితే బలపరీక్ష నిర్వహిస్తారని ఆశ పెట్టుకున్న బీజేపీ నాయకులు ఈ పరిణామంతో షాక్ కు గురయ్యారు.

దీంతో ఈ విషయంలో న్యాయపోరాటానికి సిద్ధమైంది బీజేపీ. మాజీ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్ నేతృత్వంలో పది మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 12 గంటలలోగా కమల్ నాథ్ సర్కారు తమ బలాన్ని నిరూపించుకునేలా ఆదేశాలివ్వాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా గవర్నర్ లాల్జీ ఠాండన్‌ను బీజేపీ నేతలు కలిశారు. కమల్ సర్కారు బలపరీక్ష నిరూపించుకోవాలంటూ మరోసారి ఆదేశించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ లాల్జీ ఠాండన్ కమల్ నాథ్ సర్కార్‌కు కొత్త డెడ్‌ లైన్‌ విధించారు. ఇవాళ్టి లోగా అసెంబ్లీలో బలపరీక్ష ద్వారా మెజార్టీ నిరూపించుకోవాలని కమల్‌నాథ్ ప్రభుత్వానికి తాజా ఆదేశాలు జారీ చేశారు. 

Tags:    

Similar News