Madhya Pradesh Covid19 Updates: ముంబై, ఢిల్లీ నగరాలతో పోలిస్తే మా దగ్గర కరోనా తీవ్రత తక్కువే!

Madhya Pradesh Covid19 Updates: మధ్యప్రదేశ్లో కరోనా వైరస్ అదుపులోనే ఉందన్నారు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి నరోత్తమ్‌ మిశ్రా.. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వివరణ ఇచ్చారు..

Update: 2020-06-29 09:46 GMT

Madhya Pradesh Covid19 Updates: మధ్యప్రదేశ్లో కరోనా వైరస్ అదుపులోనే ఉందన్నారు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి నరోత్తమ్‌ మిశ్రా.. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వివరణ ఇచ్చారు... ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2500 ఉండగా తాము 25,000 బెడ్లను సిద్ధంగా ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ముంబై, ఢిల్లీ నగరాలతో పోలిస్తే తమ రాష్ట్రంలో కరోనా తీవ్రత తక్కువగానే ఉందని, ఒకవేళ వ్యాధి తీవ్రత పెరగినా కూడా మేము దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతామనే ధైర్యం ఉందన్నారు. ఇక కరోనా చికిత్సకి సంబంధించిన బెడ్లు, ఆక్సీజన్‌, వెంటిలేటర్లు, మాస్కులు, పీపీఈ కిట్లు అన్ని అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు.. ఇక రాష్ట్రంలో కరోనా తీవ్రత గురించి ముఖ్యమంత్రి ఆరా తీసుకున్నట్లుగా ఆయన వెల్లడించారు..

మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 13186 పాజిటివ్‌ కరోనా కేసులుండగా, 10084 మంది డిశ్జార్జి అయ్యారు. 2545 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.. ఇక కరోనాతో పోరాడి ఇప్పటవరకూ అక్కడ 557 మంది మృతి చెందారు.

ఇక అటు దేశవ్యాప్తంగా కూడా కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 19,459 కేసులు నమోదు కాగా, 380 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి మొత్తం 5,48,318 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,10,120 ఉండగా, 3,21,722 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 16,475 మంది కరోనా వ్యాధితో మరణించారు.


Tags:    

Similar News