కరోనా కాటుకు బలైన ఏసీపీ

భారత్ లో ఇప్పటివరకు 4 లక్షల 12,400 పిపిఇ కిట్లను వివిధ రాష్ట్రాలకు పంపిని చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.

Update: 2020-04-18 11:25 GMT
Ludhiana ACP Anil Kohli

భారత్ లో ఇప్పటివరకు 4 లక్షల 12,400 పిపిఇ కిట్లను వివిధ రాష్ట్రాలకు పంపిని చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.భారత్ లో ఇప్పటివరకు 4 లక్షల 12,400 పిపిఇ కిట్లను వివిధ రాష్ట్రాలకు పంపిని చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. సింగపూర్ నుంచి 2 లక్షల కిట్లు త్వరలో వస్తాయని భావిస్తున్నారు. 25 లక్షల 82 వేల178 N-95 మాస్క్‌లు, 4 కోట్ల 28 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలు కూడా రాష్ట్రాలకు పంపారు.

మరోవైపు దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 14,778 కు పెరిగింది. ఈ గణాంకాలు covid19india.org మరియు రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం ప్రకారం ఉన్నాయి. అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం మాత్రం దేశంలో 14,378 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. వీరిలో 11,906 మంది చికిత్స పొందుతున్నారు, 1,991 మందికి నయమవ్వగా.. 480 మంది మరణించారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇదిలావుంటే పంజాబ్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. లూధియానాలో కరోనా ఇన్‌ఫెక్షన్ కారణంగా ఏసీపీ అనిల్ కోహ్లీ (52) మరణించారు. ఇటీవల ఆయనకు వైరస్‌ లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆయన స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో ఆయనను వెంటిలేటర్‌ మీద ఉంచారు. దురదృష్టవశాత్తు శనివారం మరణించారు. ఈ మేరకు ఏసీపీ మృతిని స్థానిక అధికారులు ధృవీకరించారు.


Tags:    

Similar News