ఎల్‌పీజీ వినియోగదారులకు శుభవార్త!

కరోనావైరస్ కారణంగా ప్రస్తుతం దేశం మొత్తం కష్టాలను ఎదుర్కొంటున్న తరుణంలో ఎల్‌పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.

Update: 2020-04-01 10:21 GMT

కరోనావైరస్ కారణంగా ప్రస్తుతం దేశం మొత్తం కష్టాలను ఎదుర్కొంటున్న తరుణంలో ఎల్‌పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మెట్రో ప్రాంతాల్లో సబ్సీడియేతర లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పీజీ) సిలిండర్‌ (14.2 కేజీ) ధరను రూ.65 తగ్గిస్తున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) తెలిపింది. ఈ తగ్గించిన రేట్లు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమలు రానున్నాయి. ఈ మేరకు బుధవారం ఐఓసీ ప్రకటన విడుదల చేసింది.

తాజా తగ్గింపుతో వంట గ్యాస్ రేట్లను వరుసగా రెండవ నెల తగ్గింనట్టయింది. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్‌ ధరలు 55 శాతం మేర పడిపోవడంతో రేట్లు తగ్గించినట్లు ఐఓసీ స్పష్టం చేసింది. దీంతో ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ. 805,5 ఉంటే తాజాగా రూ.744 లకే రానుంది. ఇక కోలకతాలో అయితే రూ. 839,5 ఉండగా ఇప్పుడు రూ. 774,50 కే రానుంది. అలాగే ముంబైలో రూ.776,5 ఉంటే రూ. 714,50 కే రానుంది ఇక చెన్నైలో రూ.826 ఉంటే ప్రస్తుత తగ్గింపు ప్రకారం రూ. 761,50 కే రానుంది.


Tags:    

Similar News