Lockdown Day 5: 200 కిలోమీటర్లు నడిచి డెలివరీ ఏజంట్ మృతి

కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రధాని నరేంద్ర మోడీ విధించిన 21 రోజుల లాక్డౌన్ కారణంగా ఓ వ్యక్తి తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు.

Update: 2020-03-29 04:44 GMT

కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రధాని నరేంద్ర మోడీ విధించిన 21 రోజుల లాక్డౌన్ కారణంగా ఓ వ్యక్తి తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు.మధ్యప్రదేశ్లోని తన ఇంటికి చేరుకోవడానికి ఢిల్లీ నుండి 200 కిలోమీటర్ల దూరం నడిచిన 38 ఏళ్ల వ్యక్తి దారిలో మరణించాడు. ఢిల్లీ లో డెలివరీ ఏజెంట్‌గా పనిచేసిన రణవీర్ సింగ్.. లాక్ డౌన్ కారణంగా పని లేకుండా పోయింది. దాంతో చేతిలో డబ్బు లేదు, ఆశ్రయం పొందడానికి అవకాశం లేకుండా పోయింది.. దాంతో తన స్వగ్రామానికి బయలుదేరాడు, రైళ్లు, బస్సులు రద్దు కావడంతో రణ్‌వీర్ సింగ్ దేశ రాజధాని నుండి 326 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలోని తన గ్రామానికి నడవడం ప్రారంభించాడు.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో హైవేపై కళ్ళు తిరిగి పడిపోయాడు.. స్థానిక దుకాణదారుడు గమనించి అతనికి టీ మరియు బిస్కెట్లు ఇచ్చాడు. అయితే తన గ్రామానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రమంలో రణ్‌వీర్ సింగ్‌కు గుండెపోటు వచ్చి మరణించాడు. మరోవైపు వలస కార్మికులపై ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీ ప్రభుత్వాలు శనివారం స్పందించి ప్రజలను ఇంటికి తీసుకెళ్లేందుకు బస్సులను ఏర్పాటు చేశాయి.. సుమారు 1,000 బస్సులను ఏర్పాటు చేసినట్లు యుపి ప్రభుత్వం తెలిపింది.. అలాగే తాము 200 బస్సులను కూడా సర్వీసులోకి తీసుకువస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.


Tags:    

Similar News