PM Modi vs Stalin: సంతకాలు ఎవరూ తమిళంలో పెట్టడంలేదు.. మీరు కూడా అంతే.. స్టాలిన్‌కు మోదీ మైండ్ బ్లోయింగ్ కౌంటర్!
PM Modi vs Stalin: మోదీ తన తమిళనాడు పర్యటనలో ఓవైపు అభివృద్ధిని వివరించడమే కాకుండా, స్టాలిన్ ప్రభుత్వానికి ఘాటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. భాషపై ప్రేమను మాటల్లో కాకుండా పనిలో చూపాలని చెప్పిన మోదీ, మరోసారి తన ప్రచార శైలితో జనాన్ని ఆకర్షించారు.
PM Modi vs Stalin: సంతకాలు ఎవరూ తమిళంలో పెట్టడంలేదు.. మీరు కూడా అంతే.. స్టాలిన్‌కు మోదీ మైండ్ బ్లోయింగ్ కౌంటర్!
PM Modi vs Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కౌంటర్ ఇచ్చారు. తమిళ భాషపై నడుస్తున్న వివాదం నేపథ్యంలో స్టాలిన్‌పై ఘాటుగా స్పందించారు. రామేశ్వరం సభలో మాట్లాడిన మోదీ, తమిళనాడు నాయకులు తరచూ తనకు లేఖలు రాస్తారనేమో గానీ, ఒక్కరూ కూడా తమ సంతకాన్ని తమిళంలో చేయడంలేదని అన్నారు. ఒకవేళ నిజంగా తమిళ భాషపై గర్వం ఉంటే, కనీసం పేరైనా తమిళంలో సంతకం చేయాలని సూచించారు.
తమిళ భాషను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంపై కేంద్రం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్న మోదీ, తమిళనాడు నేతలు మాటల్లో మాత్రం భాషపై ప్రేమ చూపించినా, ఆచరణలో మాత్రం అది కనిపించటం లేదని అన్నారు. అసలు నిజమైన గర్వం ఉంటే, సంతకాలే కాదు, నిత్య జీవితంలోనూ తమిళ భాషను అనుసరించాలని సూచించారు. తమిళనాడు ప్రభుత్వంపై మరో విషయంలోనూ పీఎం విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం పేద విద్యార్థులకు మెడికల్ విద్య అందుబాటులోకి తేవాలంటే, తమిళ భాషలోనే మెడికల్ కోర్సులు ప్రారంభించాలని కోరారు. అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లకుండా యువత ఇక్కడే డాక్టర్ అవ్వాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, గత పదేళ్లలో తమిళనాడుకు 11 కొత్త మెడికల్ కాలేజీలు అందించామని చెప్పారు.
కేంద్రం నిధులను ఇవ్వడం లేదన్న తమిళనాడు ఆరోపణలపై కూడా మోదీ ఘాటుగా స్పందించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమిళనాడుకు కేంద్ర నిధులు పెరిగాయని వివరించారు. 2014లో ఏడాదికి కేవలం రూ.900 కోట్లు మాత్రమే రైల్వే బడ్జెట్‌గా వచ్చినప్పుడు, ఇప్పుడు అది రూ.6000 కోట్లను దాటిందని చెప్పారు. అంతేకాదు, రామేశ్వరం సహా 77 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామని తెలిపారు.