Kumbh Mela: గిన్నిస్ రికార్డు దిశగా కుంభమేళా.. 15వేల మంది కార్మికులతో పారిశుద్ధ్య నిర్వహణ

Update: 2025-02-25 05:17 GMT

 Kumbh Mela: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 60కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ నేపథ్యంలోనే గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ డ్రైవ్ ను నిర్వహించారు. దాదాపు 15వేల మంది కార్మికులు చీపురు పట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు, ప్రయాగ్ రాజ్ మేయర్ గణేశ్ కేసర్వాని, మహాకుంభ్ ప్రత్యేక ఈవో ఆకాంక్ష రాణా పర్యవేక్షించారు. రికార్డుకు సంబంధించిన తుది నివేదిక మూడు రోజుల్లో వెలువడనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇక 2019లో ప్రయాగ్ రాజ్ లో జరిగిన కుంభమేళాలో 10వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకున్నారు.

కాగా ఈ మహాకుంభమేళా జనవరి 13న మొదలయ్యింది. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఇప్పటి వరకు పవిత్ర త్రివేణి సంగమంలో 60కోట్లకు మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈనెల 26న మహాశివరాత్రి పర్వదినం రావడంతో భక్తుల రాక మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

Tags:    

Similar News