మోదీతో ఉన్న ఈ బుడతడు ఎవరో తెలుసా ?!

Update: 2019-07-23 15:45 GMT

ప్రధాని నరేంద్ర మోడీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫోటోలు ఆయన అభిమానులతో పాటు మీడియా వర్గాల్లో కూడా కాసేపు చర్చనీయాంశంగా మారాయి. పార్లమెంట్‌లో మోడీ ఓ చిన్నారితో ఆడుతున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ చాలా ప్రత్యేకమైన స్నేహితుడు ఒకరు ఈ రోజు పార్లమెంటులో నన్ను కలుసుకున్నారని క్యాప్షన్‌ ఇచ్చారు. పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఫోటోలు లక్షల్లో లైక్‌లతో తెగ వైరల్‌ అయ్యాయి.

దాంతో పాటు మోదీ చేతుల్లో ఉన్న చిన్నారి ఎవరో తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ప్రయత్నం చేశారు. తొలుత మోదీని కలవడానికి వచ్చిన సందర్శకులకు సంబంధించిన వారి బిడ్డగా భావించారు. అయితే చివరకు ఆ బుడతడు బీజేపీ పార్లమెంట్‌ మెంబర్‌ సత్యనారాయణ జతియా మనవడిగా తెలీంది.




 


Tags:    

Similar News