మందు బాబులకు గుడ్‌న్యూస్.. డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ తో వస్తే మద్యం ఇవ్వాలని సీఎం ఆదేశాలు

Update: 2020-03-30 05:13 GMT
representative image

కరోనా వైరస్ విస్తరించకుండా దేశవ్యాప్తంగా  ప్రభుత్వం సమర్ధంతంగా లాక్ డౌన్ ను అమలు చేస్తుంది. దీంతో మద్యం దొరక్క మందుబాబుల పిచ్చి చేష్టలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు మందు తాగడానికి అలవాటు పడి ఉండడంతో ఒక్క సారిగా అది దొరక్కపోవడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. అంతే కాదు కొంత మంది ఆత్మహత్యా ప్రయత్యలు చేసుకుంటున్నారు.  మద్యం దొరక్క విలవిల్లాడుతున్న మందుబాబులకు కేరళ సర్కారు శుభవార్త చెప్పింది.

కేరళ రాష్ట్రంలో మద్యానికి బానిసైన వారి ఆత్మహత్యలు పెరిగాయి. దీని నివారణకు డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ ఉన్న వారికి మద్యం అందించాలని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్‌ ఎక్సైజ్‌ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఆన్ లైన్ ద్వారా మద్యం విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు మద్యాన్ని మాని వేయాలని అనుకుంటున్న వారికి ఉచితంగానే శస్త్ర చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డీ అడిక్షన్ సెంటర్ లో చేరిపించాలని ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు కేరళ సీఎం పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు. 

Tags:    

Similar News