BRS Bahiranga Sabha: హైదరాబాద్ నుంచి నాందేడ్‌కు చేరుకోనున్న కేసీఆర్
BRS Bahiranga Sabha: కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరనున్న మహారాష్ట్ర ముఖ్యనేతలు
BRS Bahiranga Sabha: హైదరాబాద్ నుంచి నాందేడ్‌కు చేరుకోనున్న కేసీఆర్
BRS Bahiranga Sabha: బీఆర్ఎస్ పార్టీ నాందేడ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు ఉండే అవకాశం ఉంది. కాసేపట్లో కేసీఆర్ నాందేడ్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో బయలుదేరి సభా వేదిక సమీపంలోని చత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం చారిత్రక గురుద్వారాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అక్కడి నుంచి సభాస్థలికి చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ నేతలు పార్టీలో చేరనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభా స్థలి నుంచి స్థానిక సిటి ప్రైడ్ హోటల్‌కు చేరుకుంటారు. భోజనానంతరం 4గంటలకు జాతీయ, స్థానిక మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.