రాజకీయల నుండి తప్పుకునే ఆలోచనలో ఉన్నాను : కుమారస్వామి...

Update: 2019-08-03 13:24 GMT

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి మరియు జేడియస్ నాయకుడు హెచ్‌డి కుమారస్వామి సంచలన వాఖ్యలు చేసారు. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నానని అన్నారు. తాను రాజకీయాలకు అనుకోకుండా వచ్చానని మరియు అనుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యానని చెప్పుకొచ్చారు. దేవుడు కూడా నాకు రెండుసార్లు సీఎం కావడానికి అవకాశం ఇచ్చాడని తన చివరి దశలో కర్ణాటక ముఖ్యమంత్రిగా చేసిన పనితీరు పట్ల సంతృప్తిగా ఉందని ఆయన అన్నారు. నేను ఎవరినీ సంతృప్తి పరచడానికి రాజకీయాల్లోకి రాలేదని , గడిచిన 14 నెలల్లో నేను రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసానని అన్నారు . నేటి రాజకీయాలు ఎక్కడికి వెళుతున్నాయో తానూ గమనిస్తున్నానని అన్నారు. రాజకీయాల్లోకి తన కుటుంబాన్ని లాగొద్దని అయన వాఖ్యానించారు .  

Tags:    

Similar News