ముగిసిన కర్ణాటక ఉపఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్ని ఆ పార్టీ వైపే

కర్ణాటకలో ఉపఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 15 స్థానాలకు ఉపఎన్నిలు జరిగాయి.

Update: 2019-12-05 14:48 GMT
Karnataka Bye elections Representative image

కర్ణాటకలో ఉపఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 15 స్థానాలకు ఉపఎన్నిలు జరిగాయి. బీజేపీ ప్రభుత్వానికి ఈ ఉపఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. 66 శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. డిసెంబర్ 9న తుది ఫలితాలు వెలువడనున్నా్యి. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని కళాశాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

ఉపఎన్నికల ఫలితాలపై కొన్ని సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించాయి. ఈ ఉపఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ సంస్థలు అంచన వేస్తున్నాయి. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జేడీఎస్‌, కాంగ్రెస్‌లకు ఓటమి తప్పేలా లేదని ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తు్న్నాయి. మొత్తం 15 స్థానాల్లో బీజేపీ 8-10, కాంగ్రెస్‌ 3-5, జేడీఎస్‌ 1-2, గెలిచే అవకాశం ఉందని కన్నడ పబ్లిక్‌ టీవీ తెలిపింది. బీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం బీజేపీ 9, కాంగ్రెస్‌ ,జేడీఎస్‌ చెరి 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. పవర్‌ టీవీ బీజేపీ 8-12, కాంగ్రెస్‌కు 3-6 స్థానాలు జీడీఎస్ 1 సీటు గెలిచే అవకాశం ఉందని తెలిపింది.

కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్, జేడీఎస్ సర్కార్ అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో 17 మంది ఎమ్మెల్యేలు బీజేపీ మద్దతు తెలిపారు. దీంతో వారిపై అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ వేటు వేశారు. దీంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే రెండు నియోజవర్గాలు న్యాయ పరమైన కేసులు ఉండడంతో అక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో 15 చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. ఉపఎన్నికల్లో కాంగ్రెస్, జేడీస్ వేరు వేరుగా పోటీ చేశాయి. 

Tags:    

Similar News