జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ చెందిన ఎంపీలతో భేటీ అయ్యారు. కర్ణాటకకు చెందిన యువ ఎంపీలను ఆయన కలిశారు. బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య, మైసూరు ఎంపీ ప్రతాప్ సింహాను పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ పర్యటనలో పవన్‌తోపాటు జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఎంపీ ప్రతాప్ సింహా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
అయితే ఈ సందర్భంగా ఎంపీ ప్రతాప్ సింహా చేసిన ట్విట్ పలు ఆసక్తికర కామెంట్స్ పెట్టారు. పవన్ కళ్యాన్ అంటే నాకు ఎంతో అభిమానమని, చదువుకునే రోజుల్లో పవన్ కళ్యా్న్ ను ఎంతగానో అభిమానించే వాడిని, ఆయన సినిమాలు చూసేవాడ్ని, నేనూ సూర్య కలిసి పవన్ కళ్యాణ్ తో మాట్లాడే అవకాశం రావడం సంతోషంగా ఉంది. అందుకు మీకు ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ సర్ , విశ్వాగారూ అని ఎంపీ ప్రతాప్ సింహా ట్విట్ చేశారు.
అయితే పవన్ కళ్యాన్ నటించిన కొన్ని సినిమాలు కన్నడలోకూడా విడుదలైయ్యాయి. దీంతో పవన్ కు కన్నడతోనూ మంచి ఫ్యా్న్ ఫాలోయింగ్ ఉంది. పవన్ సినిమాల కోసం యూత్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. కాగా.. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బీజీగా ఉన్నారు. గతంలో అనేక సార్లు సభల్లో పవన్ కళ్యాణ్ తనకు బీజేపీ ఎంపీలు తెలుసని అనేవారు. ప్రభుత్వం ప్రజాసమస్యలపై స్పందించకపోతే బీజేపీ నేతలకు ఫిర్యాదు చేస్తానని హెచ్చిరించిన సంగతి తెలిసిందే.
I used to watch his movies n adore him when i was in college. Today myself n @Tejasvi_Surya had the opportunity to meet n talk to him. Thank u @PawanKalyan Sir n Vishwa Gaaru! pic.twitter.com/BHJ41hLfZ4
— Pratap Simha (@mepratap) January 5, 2020