Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని దోడాలో జోషిమఠ్ పరిస్థితులు
Jammu Kashmir: పరిశీలించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం
Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని దోడాలో జోషిమఠ్ పరిస్థితులు
Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని దోడాలో ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. థాత్రి ప్రాంతంలోని నాయ్ బస్తీ గ్రామంలో సుమారు 19 ఇళ్లు, మసీదు, మదర్సాకు పగుళ్లు ఏర్పడ్డాయి. భయాందోళనకు గురైన స్థానికులు ఆ ఇళ్లను ఖాళీ చేశారు. వారంతా తమ బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. గతేడాది డిసెంబర్ నెలలో దోడా జిల్లాలోని పలు ఇళ్లు పగుళ్లిచ్చాయి. ఇందులో ఒక ఇల్లు శనివారం కూలిపోయింది. ఈ నేపథ్యంలో దాని సమీపంలోని మరిన్ని భవనాలు బీటలు వారాయి. గురువారం వరకు ఆరు ఇళ్లలో పగుళ్లు కనిపించగా శుక్రవారం నాటికి ఈ సంఖ్య మరింత పెరిగింది. సమాచారంఅందుకున్న దోడా జిల్లా అధికారులు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. పగుళ్లిచ్చిన ఇళ్లను పరిశీలించాయి. జోషిమఠ్ మాదిరిగా ఈ ప్రాంతం కూడా కుంగుతున్నదని దోడా జిల్లా అధికారులు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. పగుళ్లిచ్చిన ఇళ్లలోని నివాసితులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు వెల్లడించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.