జేఈఈ, నీట్ ప‌రీక్షా తేదీలు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

Update: 2020-05-05 10:37 GMT

లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదాప‌డ్డ ఐఐటీ, జేఈఈ, నీట్‌ పరీక్షల తేదీలను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ ఫోఖ్రియాల్‌ వివరాలు వెల్లడించారు. జులై 18 నుంచి 23 వరకూ జేఈఈ మెయిన్ పరీక్షలు జరుగుతాయి. అడ్వాన్స్‌ పరీక్షలు ఆగస్ట్‌లో జరుగుతాయి. జులై 26న నీట్ పరీక్ష నిర్వహిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్ర‌న్స్ టెస్ట్‌ (నీట్‌) ప‌రీక్ష 15 లక్షల మంది, జేఈఈ–మెయిన్స్‌ రాసేందుకు 9 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకున్నారని వెల్ల‌డించారు.

Tags:    

Similar News