కాశ్మీర్ విభజన బిల్లు : లాంఛనం ముగిసింది

Update: 2019-08-06 13:44 GMT

జమ్మూ కాశ్మీర్ ను రెండు భాగాలుగా చేస్తూ కేంద్రం ప్రతిపాదించిన జమ్మూ కాశ్మీర్ రీ ఆర్గనైజేషన్ బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది. ఈరోజు ఉదయం నుంచీ ఈ బిల్లుపై లోక్ సభలో విస్తృత చర్చ జరిగింది. చర్చలో పలువురు ఎంపీలు తమ అభిప్రాయాన్ని తెలిపారు. అయితే, ఈ బిల్లు ఉద్దేశ్యాలను హోం మంత్రి అమిత్ షా వివరిస్తూ ఇది పాలనా సౌలభ్యం కోసం చేస్తున్న ఏర్పాటుగా వర్ణించారు. దశాబ్దాలుగా లడఖ్ ప్రజల కోరిక మేరకు విభజన చేస్తున్నట్టు వివరించారు. విపక్షాలు బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడాయి. చర్చ అనంతరం బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. మూజువాణీ ఓటు పద్ధతిలో జరిగిన ఓటింగ్ లో బిల్లుకు అనుకూలంగా 351 మంది సభ్యులు ఎస్ చెప్పగా.. వ్యతిరేకంగా 72 మంది నో చెప్పారు. దీంతో బిల్లు లోక్ సభ ఆమోదం పొందినట్టు సభాపతి ప్రకటించారు.



Tags:    

Similar News