Jammu and Kashmir.. టూరిస్టులకు చల్లని కబురు

జమ్మూకశ్మీర్‌లో అధికరణ 370 రద్దు తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పర్యాటకుల కోసం ఈ ఆంక్షలు తాత్కలికంగా ఉప‌సంహ‌రిస్తున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది.

Update: 2019-10-10 06:32 GMT

జమ్మూకశ్మీర్‌లో అధికరణ 370 రద్దు తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో అమర్నాథ్ యాత్రకు వచ్చిన వారిని సైతం అక్కడి నుంచి బలగాలు పంపించారు. అయితే తాజాగా పర్యాటకుల కోసం ఈ అంక్షలు తాత్కలికంగా ఉప‌సంహ‌రిస్తున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది.ఈ మేరకు గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆదేశాలు జారీ చేశారు. కశ్మీర్ ప్రధాన ఆర్థిక వనరులుగా  టూరిజం ఉంది. కాగా... పర్యాటకులపై నిషేదం కారణంగా అక్కడ టూరిస్టులు ఎవరూ వెళ్లలేదు. దీంతో అక్కడ టూరిజం పై వచ్చే ఆదాయం దెబ్బతింది. దీంతో రెండు నెలల తర్వాత గవర్నర్ ఆదేశాల మేరకు యాత్రికులకు అనుమతి ఇచ్చారు. అంతేకాకుండా కశ్మీర్ అందాలను చూడడానికి వచ్చే ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయాన్ని ప్రభుత్వం నుంచి అందిస్తామని ప్రకటనలో పేర్కొంది.

అయితే జమ్మూకశ్మీర్ స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ ట్రావల్ అడ్వైజరీ నిషేదం అమల్లోకి వచ్చింది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండోచ్చని ప్రభుత్వం 1.52 ల‌క్షల మంది యాత్రికులను తిరిగి పంపించింది. తాక్కలికింగా టెలిఫోన్‌, నెట్ సేవ‌ల‌ను నిలిపివేస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  

Tags:    

Similar News