కోవిడ్‌-19 ఎమర్జెన్సీ ప్యాకేజ్‌కు కేంద్రం ఆమోదం

కోవిడ్‌-19 ఎమర్జెన్సీ సన్నాహక ప్యాకేజ్‌కు కేంద్ర ప్రభుత్వం గురువారం ఆమోదం తెలిపింది.

Update: 2020-04-09 10:38 GMT

కోవిడ్‌-19 ఎమర్జెన్సీ సన్నాహక ప్యాకేజ్‌కు కేంద్ర ప్రభుత్వం గురువారం ఆమోదం తెలిపింది.ఇందులో భాగంగా అవసరమైన వైద్య పరికరాలు, ఔషదాల సేకరణ, అలాగే నిఘా కార్యకలాపాలను బలోపేతం చేయడానికి జాతీయ, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్ధలను పటిష్టం చేసేందుకు కేంద్ర నిధులతో ఇండియా కోవిడ్‌-19 ఎమర్జెన్సీ ప్యాకేజ్‌ను ఏర్పాటు చేసింది.

అన్ని రాష్ట్రాలు, యుటిల అదనపు కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, కమిషనర్లు (ఆరోగ్యం) కు రాసిన లేఖలో, ఆరోగ్య మంత్రిత్వ శాఖ 100 శాతం కేంద్ర నిధుల ప్యాకేజీని జనవరి 2020 నుండి మార్చి 2024 వరకు మూడు దశల్లో అమలు చేయనున్నట్లు తెలిపింది.

2020 జూన్ వరకు మొదటి దశ అమలు కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాతీయ ఆరోగ్య మిషన్ కింద రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలకు నిధులను విడుదల చేస్తోంది. మొదటి దశలో COVID-19 ఆస్పత్రుల అభివృద్ధికి రాష్ట్రాలు, యుటిలకు మద్దతు, ఐసోలేషన్ బ్లాక్స్, ఆసుపత్రులలో వెంటిలేటర్లు, ఆక్సిజన్ సరఫరాతో ఐసియులు, ప్రయోగశాలలను బలోపేతం చేయడం, అదనపు సిబ్బందిని నియమించడం, కమ్యూనిటీ హెల్త్ వాలంటీర్లు ఉంటారని లేఖలో పేర్కొన్నారు.

అలాగే వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఎన్ -95 మాస్కులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. చేపట్టాల్సిన కార్యకలాపాలలో ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా వినియోగాలు, అంబులెన్స్‌ల క్రిమిసంహారక పనులు కూడా ఉన్నాయి.


Tags:    

Similar News